Aadivaram Sandadi ఆదివారం సందడి

45.00

Categories: , Tag:

Product Description

ప్రేమ, బాల్యం నిత్యనూతనం అయినవి. అంతకు ముందు ఎంతో మంది, ఎన్నోసార్లు ఆ అనుభూతులకు లోనయినా మొదటిసారి దానిని అనుభవించే వాళ్లకి అవి ఎంతో ఉత్సాహాన్నీ, సంతోషాన్నీ ఇస్తాయి. జీవితాన్ని కొత్త కళ్లతో చూడటం మొదలవుతుంది.

ఎదుగుతున్న పిల్లల మధ్య ఉండటం ఒక వరం. ‘అసలు కన్నా వడ్డీ ముద్దు’ అన్నట్టు అది పిల్లల పిల్లలయితే మరింత మధురం. ప్రేమికులు తమదైన ప్రపంచంలో ఉన్నట్టు పిల్లల ప్రేమలో పడిన వాళ్లు ఆ లోకంలో మునిగిపోతారు.

మనవడు బన్నీతో అలాంటి మధుర అనుభవాలనే అమ్మమ్మ దాసరి శివకూమారి అక్షరబద్ధం చేశారు. ఆ ఘటనలు పాతబడుతున్న కొద్దీ వాటి జ్ఞాపకాలు తీపెక్కుతూ ఉంటాయి. ఆ తీయందనాన్ని ఈ పదకొండు కథలలో పంచుకోండి.

 

ఈ మంచి పుస్తకం గురించి నలుగురికీ చెప్పండి...Share on Facebook
Facebook
0Share on Google+
Google+
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin