Agnimala అగ్నిమాల

60.00

సృష్టిలో జీవరాశులు అనంతరం. సృష్టి అనంతంగా కొనసాగడానికి ఇంచుమించు అన్ని జీవరాశుల్లోనూ స్త్రీపురుష విభజన సామాన్యం. మనుషుల్లో స్త్రీ పురుష బంధాన్ని అసామాన్యం చేసింది ప్రేమ. సామాన్య జీవితంలో అంతర్లీనమై భాసిల్లే ప్రేమని – వెలికి తీసి మనోహరం చేసి సామాన్యుడికి అందిస్తుంది సాహిత్యం. ఏ భాష సాహితి చూసినా నరజాతి చరిత్ర సమస్తం ప్రేమాయణ పరవశత్వం.

సాహిత్యంలో ప్రేమ పుట్టుకకు – వినికిడి, తొలిచూపు కారణమవడం సర్వసాధారణం. కొండొకచో వ్యామోహం, రాజకీయం ప్రేమకు దారి తీసినా – ఆ కథల్లో వ్యూహానికున్న ప్రాధాన్యం ప్రేమకు లభించకపోవడం సాధారణం. అలా చూస్తే అసామాన్య రచయిత శ్రీ దాసరి సుబ్రహ్మణ్యకృత ‘అగ్నిమాల’ అసాధారణం.

Category: Tag: