Anaga Anaga Kathalu అనగా అనగా కథలు

55.00

వివిధ దేశాల జానపద కథలు
అబ్బూరి ఛాయాదేవి

జానపద కథలంటే పిల్లలు చెవి కోసుకుంటారు. కొన్ని వందల సంవత్సరాలు ప్రజల నాల్కల మీద నిలిచిన కథలు ఇప్పుడు ఎక్కువగా పుస్తకాలుగా వస్తున్నాయి. ‘మౌఖిక సంస్కృతి’ నుంచి ‘లిఖిత సంస్కృతి’ వైపు పయనాన్ని సూచిస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితమే అబ్బూరి ఛాయాదేవి గారు వివిధ దేశాల జానపద కథలను తెనిగించారు. వాటికి బొమ్మలు వేయించి మళ్ళీ ముందుకు తీసుకురావడం మాకు సంతోషంగా ఉంది.

మంచి చెడులు, ధైర్యసాహసాలు, అసూయాద్వేషాలు, కుట్రలూకుతంత్రాలు, మాయా మర్మాలు ఏ దేశ జానపద కథలలోనైనా ఉంటాయి. ఇలాంటి కథలే మన దేశ జానపద సాహిత్యంలోనూ ఉన్నాయి.

జానపద కథలు పిల్లలకు అద్భుత ఊహా ప్రపంచానికే కాకుండా, అంతరంగ చిత్రాలకు కూడా తలుపులు తెరుస్తాయి. తామేమిటో, ఈ లోకం ఏమిటో, ఈ లోకంలో తమ స్థానం, పాత్ర ఏమిటో అర్థం చేసుకోడానికి పిల్లలకు ఇలాంటి కథలు దోహదపడతాయి.

ఈ పుస్తకం పిల్లలకు ఇవ్వడమంటే అద్భుత ప్రపంచాలను వాళ్ళ చేతులలో ఉంచడమే.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication