Ananda-Lokam

Anandalokam ఆనందలోకం

60.00

‘ఎక్కడైనా ఇలా జరుగుతుందా, చోద్యం కాకపోతే…’ అనే పదాలకు బాలసాహిత్యపు ఖజానా అయిన జానపద కథాసాహిత్యంలో స్థానం లేదు. ’ఇలా జరిగితే ఎంత బాగుంటుంది!’ అనే వూహ బాలబాలికలకు అంతులేని సంతృప్తిని కలిగిస్తుంది. రాజులూ, కోటలూ, సింహాసనాలూ, అంతఃపురం మహారాణి, యువరాణి. ఉద్యానవనాలు, మంత్రగాళ్ళు, పర్వతాకారులైన రాక్షసులూ, కీకారణ్యాలూ, పంచకళ్యాణీలూ, భూగర్భంలో దాగివున్న బంగారం, రత్నరాసులూ, జంతువులుగా మారిపోయిన మనుషులూ, దుర్మార్గులను, కరువు కాటకాలను అంతంచేసే యువకిశోరాలూ – ఓహ్! మాట్లాడే చిలుకలు సరేసరి – కేవలం జానపద సాహిత్యంలో మాత్రమే చూడగలం.

ఇటువంటి వాటితో కూడుకున్న జానపద సాహిత్యం ఆబాలగోపాలాన్ని అలరిస్తుంది. ’ఎక్కడైనా ఇలా జరుగుతుందా, చోద్యం కాకపోతే…’ అనకపోతే ’ఆనందలోకపు’ విహారానికి బయలుదేరండి! అవశ్యం!

ఎమ్.వి.వి.సత్యనారాయణ

Category: Tags: ,