Anni Telisina Akka అన్నీ తెలిసిన అక్క

40.00

Description

అన్నీ తెలిసిన అక్క పక్కన ఎప్పుడూ ఆమెను ఆరాధించే చెల్లి ఉంటుంది. ఒక రోజు ఆ అక్కాచెల్లెళ్లకి ఒక వింత వస్తువు కనిపించింది. అక్కకి అన్నీ తెలుసనుకుని ఆమెను ప్రశ్నలు అడిగింది చెల్లి. అన్నీ తెలిసినట్లే సమాధానాలు చెప్పింది అక్క. చివరికి అదేమిటో తెలిసాక ఆ అక్క, చెల్లెళ్లు ఆశ్చర్యపోయారు. ఆ వింత వస్తువు ఏమిటో, అది తెలిసి చెల్లి ఎలా స్పందించిందో ఈ పుస్తకం చదివి మీరే తెలుసుకోండి…

దీనికి బొమ్మలను గాయత్రి వెన్నెల వేసింది

పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి ఔత్సాహిక రచయితలు, చిత్రకారుల నుంచి బొమ్మల కథల పుస్తకాలను తానా, మంచి పుస్తకం ఆహ్వానించాయి. అలా వచ్చిన వాటిల్లోంచి ఎంపిక చేసిన పది పుస్తకాలలో ఇది ఒకటి.