Babachi Tatayya బబచి తాతయ్య

20.00

Product Description

ఎనిమిదవ తరగతి చదువుతున్న తేజ కొంత భయస్థుడు. అది అదునుగా చేసుకుని తోటి విద్యార్థి గిరి అతడిని ఏడిపిస్తూ ఉంటాడు.
నక్క నుంచి తనని కాపాడిన తేజని నేర్పరివి, ధైర్యశాలివి అంటూ పొగిడి అతనిలోని ‘భయం’ అనే బలహీనతను పొగోట్టటానికి పూనుకుంటుంది తాబేలు. అప్పటినుంచి వాళ్లిద్దరూ తాతా – మనవళ్లు అయ్యారు.
బడి పిల్లలందరూ విహారయాత్రకు వెళ్లారు. పిరికివాడని తేజను ఏడిపించటానికి, రకరకాలుగా ఇబ్బంది పెట్టి తన గొప్పతనాన్ని నిరూపించుకోటానికి గిరి ప్రయత్నిస్తుంటాడు. అయితే తాబేలు తాతయ్య చెప్పిన ‘బబచి’ అనే చిట్కాను ఉపయోగించి చాలా విషయాలు తెలుసుకున్్నాడు. ఆ చిట్కాని ఉపయోగించి తెలివిగా వ్యవహరించటమే కాకుండా, ఇతరులను కూడా కష్టాల నుంచి కాపాడాడు తేజ.
తనకి హాని చెయ్యాలనుకున్న గిరి చివరికి అతడికి స్నేహితుడిగా మారినా, టీచర్లు,తోటి విద్యార్థుల అభిమానాన్ని పొందినా అదంతా ‘బబచి’ చలవే అనుకుంటాడు తేజ.
ఇంతకీ ‘బబచి’ అంటే ఏమిటి అంటారా? అది ఏమిటో తెలియాలన్నా, దానిని ఉపయోగించి తేజ సమస్యలను ఎలా అదిగమించాడో తెలియాలన్నా ఈ పుస్కం చదవాల్సిందే.

ఈ మంచి పుస్తకం గురించి నలుగురికీ చెప్పండి...Share on Facebook
Facebook
0Share on Google+
Google+
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin