Bunty – Bunny బంటీ – బన్నీ

40.00

Description

బంటీ పార్కులో ఉండగా ఊలు బంతిలాంటి బుజ్జి కుక్కపిల్ల దొరికింది. దానికి ఎవరూ లేరని నిర్ధారించుకుని ఇంటికి తీసుకొచ్చాడు. అమ్మకి చెపితే కోప్పడుతుందని గుట్టుగా తన గదిలోకి తీసుకెళ్లాడు. కుక్కపిల్లకి బన్నీ అని పేరు పెట్టాడు, బిస్కెట్లు తినిపించాడు. బూట్ల అట్టపెట్టెలో చిన్న తువ్వాలు పరచి, దానిని పడుకోబెట్టాడు. బంటి పొద్దున లేచేసరికి అట్టపెట్టెలో కుక్కపిల్ల లేదు. ఇల్లంతా మళ్లీ, మళ్లీ వెదికినా అది కనపడలేదు. బన్నీ ఏమయ్యిందో తెలుసుకోటానికి ఈ పుస్తకం చదవండి.

దీనికి బొమ్మలను పి.యస్. బాబు వేశారు.

పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి ఔత్సాహిక రచయితలు, చిత్రకారుల నుంచి బొమ్మల కథల పుస్తకాలను తానా, మంచి పుస్తకం ఆహ్వానించాయి. అలా వచ్చిన వాటిల్లోంచి ఎంపిక చేసిన పది పుస్తకాలలో ఇది ఒకటి.