dhanak

Dhanak ధనక్

70.00

నగేష్ కుమార్ మొదటి సినిమా హైదరాబాద్ బ్లూస్ భారతీయ సినిమాల్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. అవార్డు పొందిన ఆయన సినిమా ఆధారంగా ధనక్ (ఇంద్రధనుస్సు) ను అనుష్కా రవిశంకర్ నవలీకరించారు.

చిన్నాకి చూపు కనపడదు. కానీ అతడిని అది అంతగా బాధించ లేదు. అతని అక్క అన్నింటిలో అతడికి సహాయపడుతుంది. అంతేకాకుండా తొమ్మిదవ పుట్టిన రోజుకి అతడికి చూపు వచ్చేలా చేస్తానని మాట కూడా ఇచ్చింది. అది ఇంకా ఎంతో దూరం లేదు!

కానీ పారూ ఆందోళనలో ఉంది. తాను ఇచ్చిన మాట ఎలా నిలుపుకుంటుంది? ఆమె హీరో షారూఖ్ ఖాన్ ఉన్న ‘నేత్రదానం’ పోస్టరు చూసి చిన్నాకి సహాయం చెయ్యమని అతడికి ఉత్తరాలు రాసింది. ఆ తరువాత అతడు షూటింగ్ కోసం రాజస్థాన్ వచ్చాడని ఆమెకి తెలిసింది! దాంతో చిన్నాకి తిరిగి చూపు రావటం కోసం వాళ్లిద్దరే బయలుదేరారు.

దారిలో ఎన్నో సాహసాలు, ప్రమాదాలు, చిత్ర, విచిత్ర వ్యక్తులు – అందులో సాయపడిన వాళ్లు, దుష్టులూ ఎదురయ్యారు. తమ కలను నిజం చేసుకోటానికి ఆ పిల్లలు ఇద్దరూ ఎడారి గుండా ప్రయాణం చేసారు.

Product Description

నగేష్ కుకునూర్ మొదటి సినిమా ‘హైదరాబాద్ బ్లూస్’ (1998) భారతీయ సినిమాలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. అప్పటి నుంచి అతడు ఎన్నో సినిమాలు రాశాడు, నిర్దేశించాడు, నిర్మించాడు – వీటిల్లో ఇక్బాల్, రాక్‌ఫోర్డ్, బాలీవుడ్ కాలింగ్, 3 దీవారే, దోర్, లక్ష్మి,… కొన్ని. ఇవి భారతదేశంలో, అంతర్జాతీయంగా అనేక ప్రశంసలు, బహుమతులు అందుకున్నాయి.

అనుష్కా రవిశంకర్ బహుమతి పొందిన అనేక పుస్తకాల రచయిత్రి. ఆమె ముప్పైకి పైగా పుస్తకాలు రాసింది. వీటిల్లో కాల్పనికం, కాల్పనికం కాని పుస్తకాలు ఉన్నాయి. ఆమె రాసిన పుస్తకాల్లో చాలా అనేక భాషల్లోకి అనువాదమయ్యాయి.

ఈ మంచి పుస్తకం గురించి నలుగురికీ చెప్పండి...Share on Facebook0Share on Google+0Tweet about this on TwitterShare on LinkedIn0