e-taram Kurradu e-తరం కుర్రాడు

35.00

Categories: ,

Product Description

సురేఖ, రమణల గారాల కొడుకు రవి. తొమ్మిదో తరగతి పరీక్షలు రాసి, సెలవల్లో బంధువలతో కలిసి తిరుపతి వెళ్లటానికి నాయనమ్మ, తాతయ్యల ఊరు అయిన పార్వతీపురం వెళ్లాడు.
నాయనమ్మ చేతి వంటలు తింటూ, తాతయ్యతో తిరుగుతూ, స్నేహితులతో ఆడుకుంటూ, సరదాగా గడుపుతున్నాడు. బావిలో పడిన పిల్లవాడిని ప్రాణాపాయం నుంచి కాపాడాడు రవి. అలాగే స్నేహితుడు కిషోర్, అతడి తండ్రిని విద్యుత్ ప్రమాదం నుంచి రక్షించాడు. పక్క వీధిలో కల్తీ పాలు తయారు చేసి అమ్ముతున్న బంగార్రాజుని పోలీసులకు పట్టించాడు రవి.
రైలులో తిరుపతి వెళుతుండగా రైలు దొంగ ఆట కట్టించటంలో కీలక పాత్రధారి అయ్యాడు రవి. దానితో పగ పట్టిన దొంగల ముఠా సభ్యులు తిరుపతిలో రవి వాళ్లు రైలు దిగిన తరువాత అతడిని కిడ్నాప్ చేశారు. అవయవాలు తీసి అమ్ముకోటానికి పిల్లలను ఆసుపత్రులకి, విదేశాలకి అమ్మే బోసు ముఠాకి రవిని వాళ్లు అమ్మేశారు.
విజయవాడ దగ్గర నిర్మానుష్య ప్రదేశంలో బోసు స్థావరం ఉంది. అక్కడ రవిలాగే కిడ్నాప్ అయిన మరికొంత మంది పిల్లలు ఉన్నారు. వాళ్ల సంరక్షణ, తప్పించుకోకుండా చూసే బాధ్యత రంగా, కృష్ణలది. తనలాగే కిడ్నాపయిన పిల్లల్లో ధైర్యంగా ఉన్న కమల్, రాహుల్, తేజలతో కలిసి అక్కడి నుంచి తప్పించుకోటానికి, ఇతర పిల్లలను రక్షించటానికి ప్రణాళిక వేశాడు రవి.
అన్నింటా ముందు ఉంటున్న నవతరం పిల్లల ప్రతినిధి అయిన రవి కథ ఇది.

ఈ మంచి పుస్తకం గురించి నలుగురికీ చెప్పండి...Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin