Kittu Sahasam కిట్టూ సాహసం

20.00

Product Description

కిట్టూ ఒక పల్లెటూరి పిల్లవాడు. తల్లిదండ్రులు గేదెను మేపుతూ, కష్టం చేస్తూ జీవనం గడుపుతుంటారు. తల్లిదండ్రులకు తనకు చేతనైన సహాయం చేస్తూ ఉంటాడు కిట్టూ. కిట్టూ చదువుతో పాటు, ఆటలలో కూడా బహుమతులు గెలుచుకుంటూ ఉంటాడు.
పిట్టలన్నా, జంతువులన్నా కిట్టూకి ఎంతో ప్రేమ. ఇంటిలో ఉండే పిల్లికీ, బయట ఉండే కుక్కకీ పాలు పొయ్యమని, అన్నం పెట్టమని తల్లిని బతిమాలుతుంటాడు.
తన స్నేహితుడు శ్రీనుతో కలిసి ఆడుకుంటూ ఉంటాడు కిట్టూ. వాళ్ల ఇంట్లో మట్టితో కుండలు, రకరకాల పాత్రలు తయారు చేసి కాల్చే విధానాన్ని తెలుసుకుంటాడు. ప్రతిదీ అతడిలో అంతులేని కుతూహలాన్ని కలిగిస్తుంది.
బడికి సెలవలు కావటంతో శ్రీనుతో కలిసి ఆటలు ఆడుతూ గడుపుతుంటాడు కిట్టూ. అలా ఒక రోజు ఊరి దగ్గరలోని రైలు పట్టాల దగ్గర ఆడుకుంటూ ఉన్నారు శ్రీను, కిట్టూ. పట్టాల మధ్య గేదెలు మేస్తూ ఉండగా అటవైపు నుంచి రైలు వస్తుంటే కిట్టూ వాటిని రక్షిస్తాడు. ‘సాంబయ్య కొడుకని’ ఊరి వాళ్లందరూ మెచ్చుకుంటూ ఉంటే బహుమతులు వచ్చినప్పటికంటే ఎక్కువ తృప్తిని పొందుతాడు కిట్టూ.

ఈ మంచి పుస్తకం గురించి నలుగురికీ చెప్పండి...Share on Facebook
Facebook
0Share on Google+
Google+
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin