Kotula Daadi – Seenu Telivi కోతులదాడి – శీను తెలివి

20.00

Product Description

సింధూ అనే సింధూరి, శీను అనే అక్కా-తమ్ముళ్లు. శీనుకి సంగీతం అంటే ఇష్టం. ఒక రోజు మీనా ఆంటీకి పెళ్లి పనుల్లో సహాయం చేయడానికి అమ్మా, నాన్నలు వెళితే సింధూ, శీను ఇంట్లోనే ఉన్నారు.
ఔట్‌హౌస్‌లో ఉండే సావిత్రికి జ్వరంగా ఉండటంతో తన చిన్న పిల్లలు ఇద్దరినీ తీసుకుని ఇక్కడకు వచ్చింది. అదే సమయంలో పైన బాల్కనీలోంచి లోపలికి వచ్చిన కోతులు అక్కడ ఉన్న ఆహార పదార్థాలు తింటూ, సామాను చిందవందర చేస్తూ ఉన్నాయి. శబ్దాలు అవుతుంటే చూడటానికి పైకి వెళ్లిన సింధూ పొరపాటున తాను లోపల ఉండిపోయి తలుపు వేసుకుంది.
ఇప్పుడు ఏం చెయ్యాలన్నా శూను ఒక్కడే ఉన్నాడు. తండ్రికి ఫోన్ చేస్తే అతడు తియ్యలేదు. ఇంతలో కోతులు టెలిఫోను వైరుని పీకెయ్యటంతో అది పని చెయ్యటం మానేసింది. ఆ సమయంలో కోతుల దృష్టిని శీను ఎలా మళ్లించాడు? వాటిని తరమటానికి సింధూ, శీను ఏ ఉపాయాలు పన్నారు? ఆ పిల్లల నిబ్బరం, సమయస్ఫూర్తిని తెలియ చేసే కథనంలోకి వెళదాం రండి.

ఈ మంచి పుస్తకం గురించి నలుగురికీ చెప్పండి...Share on Facebook0Share on Google+0Tweet about this on TwitterShare on LinkedIn0