Mahanagaram మహానగరం

65.00

రెక్కల భల్లూకాలు, తాటి చెట్టంత రాక్షసులు, మకర ముఖ సైనికులు, సముద్రంలో అద్భుత భవనాలు, మాయలు మంత్రశక్తులు వంటి వాటితో ఉత్కంఠభరితంగా సాగిపోయే జానపద నవల మహానగరం. పెద్దలు, పిల్లలను ఊహా ప్రపంచంలోకి లాక్కెల్లే నవల మహానగరం.

Product Description

రాజులు, రాక్షస కథలంటే మీకిష్టమేనా? అయితే ఈ మహానగరం పుస్తకం మీ కోసమే. ఇందులో రెక్కల భల్లూకాలు, మాయలు, మంత్రాలతో బోలెడు తమాషాలుంటాయి. కథేంటంటే… యశోధరుడు అనే వ్యక్తి మహానగరానికి బయలుదేరతాడు. దారిలో రాక్షసులతో స్నేహం చేసుకుని, మాట్లాడే మర్రిచెట్టు దగ్గరకు వెళ్తాడు. ఆ మర్రిచెట్టు మహానగరం గురించిన వివరాలన్నీ, యశోధరుడికి పూసగుచ్చినట్లు చెబుతుంది. అయితే నగరానికి వెళ్లొద్దని, ప్రమాదమనీ హెచ్చరిస్తుంది కూడా. కానీ యశోధరుడు నగరానికి వెళ్లేందుకే సిద్ధపడతాడు. ఆ తర్వాత ఏమైందో, అసలెందుకు వెళ్లొద్దని మర్రిచెట్టు చెప్పిందో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే! కథంతా ఉత్కంఠను రేకెత్తిస్తూ, ఆసక్తిని కలిగించేలా రాశారు రచయిత ఎన్. మరళీధర్.

– బాలభారతం, జనవరి, 2017

ఈ మంచి పుస్తకం గురించి నలుగురికీ చెప్పండి...Share on Facebook
Facebook
0Share on Google+
Google+
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin