Mamayyato Kittu Sahasa Yatra మామయ్యతో కిట్టూ సాహసయాత్ర

22.00

Product Description

దీపావళికి కిట్టూ (అసలు పేరు కృష్ణ) వాళ్లింటికి బంధువుల పిల్లలు రావడంతో సందడిగా ఉంది. ఆ సమయంలోనే ‘నడిచే విజ్ఞాన సర్వస్వం’ అయిన శేషు మామ కూడా వచ్చాడు.
కిట్టూతో కలసి వాళ్ల ఊరి గ్రంథాలయానికి వెళ్లాడు శేషు మామయ్య. అక్కడ అనేక పాత పుస్తకాలతో పాటు తాళపత్ర గ్రంథాలు కూడా ఉన్నాయి. ఒక తాళపత్ర గ్రంథంలో అతడు అంతకు ముందు విని ఉన్న కందర్ప ద్వీప వివరాలు దొరికాయి. దాంతో ఆ దీవికి వెళ్లి అన్ని విషయాలూ నిర్ధారించాలని అనుకున్నాడు. ఆ యాత్రలో కిట్టూ కూడా తోడయ్యాడు.
యాత్రకి వీసా పొందటం, శిక్షణ పొందటం, పరికరాలు సమకూర్చుకోవటం, మరింత సమాచారం సేకరించటం వంటి ఎన్నో పనులు ఉన్నాయి. వాటన్నిటినీ శేషు మామయ్య, కిట్టూ ఒకటొకటిగా చేసుకుంటూ వచ్చారు. ఈ పనుల్లో వాళ్లకి ఎందరో సహకరించారు. శరత్ కూడా యాత్రలో భాగమయ్యాడు. మర పడవను నడపటానికి ధీరజ్, విజయ్‌నాగ్‌లు వీళ్లతో పాటు వెళ్లారు. సముద్రయానంలో ఎంతో అనుభవం ఉండి ఒక పుస్తకం కూడా రాసిన జగన్నాథరావు అన్ని రకాలుగా సహాయం చేశారు, ప్రోత్సహించారు.
‘వాయేజ్’ అనే పెద్ద ఓడలో చివరికి వీళ్లంతా బయలుదేరారు. వాళ్ల ప్రయాణం ఎలా సాగిందో, కందర్ప ద్వీపంలో ఏం చేశారో తేలుసుకోటానికి ఈ పుస్తక పఠన యాత్ర మొదలు పెట్టండి.

ఈ మంచి పుస్తకం గురించి నలుగురికీ చెప్పండి...Share on Facebook
Facebook
0Share on Google+
Google+
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin