Medha – 017

40.00

Description

మేధ – 017
బ్రహ్మం ఒక శాస్త్రవేత్త. కృత్రిమ మెదడు, కృత్రిమ మేధస్సు రంగంలో దశాబ్దకాలం పైగా పరిశోధనలు చేస్తున్నాడు. మానస, మేధ – 017, అనే ఆండ్రాయిడ్‌ని తయారు చేసి తన పరిశోధనలలో పురోగమిస్తున్నాడు. యాంత్రిక రోబో కాకుండా మనిషిలాగా ఆలోచించే రోబోలను తయారు చెయ్యటానికి కృషి చేస్తున్న బ్రహ్మం ఆలోచన సరికాదని అతడి భార్య తమస్విని వాదిస్తూ ఉంటుంది.
బ్రహ్మం, తమస్వినిల పిల్లలు స్మరణ్, శృతి. తండ్రి తన పరిశోధనల్లో నిమగ్నమై ఉంటే వీళ్లు కాలక్షేపానికి వీడియో గేమ్స్, కంప్యూటర్ గేమ్స్‌కి అలవాటు పడతారు. మొదట్లో ఆసక్తికరంగా ఉన్నప్పటికీ కొంతకాలానికి అవంటే పిల్లలకు మొహం మొత్తింది. శృతి కోరిక మీద వాళ్లకి వర్చువల్ గేమ్స్ తయారు చేసిచ్చాడు బ్రహ్మం. ఉన్న చోటే ఉండి మంచు పర్వతాలలోకి, అడవులలోకి వెళ్లి వచ్చిన అనుభూతిని అది ఇస్తుంది.
కొంతకాలానికి అదంటే కూడా విసుగు పుట్టడంతో ఆర్జీ అనే రియల్ గేమ్‌ని బ్రహ్మం తయారు చేసిచ్చాడు. ఒక చిన్న మార్పు వల్ల ఆ ఆర్జీలో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి, దాని వల్ల స్మరణ్, శృతిలతో పాటు కుటుంబమంతా ఎటువంటి ఆపదలో పడింది, దాని నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారో ఆద్యంతం ఆసక్తిగా చదివించే నవల ‘మేధ – 017’.