Mosali Kajesina Sooryudu & Chedda Bhadava Elugu Bidda మొసలి కాజేసిన సూర్యుడు & చెడ్డభడవ ఎలుగుబిడ్డ

35.00

అందమైన రంగు రంగుల చిత్రాల బాలల పుస్తకం ఇది.

ఆకాశంలో షికారుకెళ్లాడు సూర్యుడు
మేఘాలమాటున మాయమైపోయాడు
కిటికీలో కూచున్న చెవులపిల్లి చూసింది
చీకట్లో చలికి గజగజ వణికింది.

తెల్లకాకులూ తల్లడిల్లి
పొలము చేరి అరిచాయి.
కొంగలన్నీ కేకలు వేశాయి:
“అయ్యో! అయ్యో! కొంపమునిగిందోయ్!
మొసలి మింగిందోయ్ సూర్యుడినీ!”