Naannari Chinnatanam నాన్నారి చిన్నతనం

60.00

అలెక్సాందర్ రాస్కిన్ (1914 – 1971) – విఖ్యాతుడైన సోవియట్ రచయిత. ముఖ్యంగా హాస్య చతురత తొణికసలాడే రచనలు చేశాడాయన.

‘నాన్నారి చిన్నతనం’ ఒక్కటే పిల్లల కోసం ఆయన రాసిన పుస్తకం. ఇది హాస్యపూరితంగా ఉంటుంది. హృదయాన్ని స్పందింప చేస్తుంది. ఇది పిల్లలకీ, తల్లిదండ్రులకీ కూడా ఎంతో నచ్చింది. చాలా ఏళ్లుగా దీన్ని అనేక ప్రపంచ భాషలలో ప్రచురిస్తున్నారు.

…రచయిత కూతురుకి ఒకప్పుడు తీవ్రమైన జబ్బు చేసింది. ఆమె బాధ మరపింపచెయ్యడానికి ఆయన తన చిన్నతనం గురించిన కథలు చెప్పాడు. “జబ్బుపడిన కూతురి పట్ల ఆయన జాలి, అనురాగం, ఆమెని కులాసాగా నవ్వేటట్లు ఉంచాలన్న ఆతృత ఎంతటివంటే ఆయన తనని తను హాస్యంపాలు చేసుకుంటున్నానని కూడా చూడకుండా ఈ కథల్ని చెప్పాడు.” అని ఒక విమర్శకుడు రాశాడు.

గొప్పలుపోతూ, తలబిరుసుగా ఉండే పిల్లల్ని, తనని కూడా మినహాయించుకోకుండా, అపహాస్యం చేస్తూ, రచయిత తన చిన్నారి పాఠకులకి ఆలోచనా ప్రేరకమైన విషయాన్ని అందిస్తున్నారు: “మొట్ట మొదటగా మీరు మంచి మనిషి అవ్వాలి. అది పైలట్‌కి గాని, పశువుల కాపరికి గాని, ఐస్‌క్రీమ్ అమ్మేవాడికి గాని ముఖ్యం…”