Product Description
తోటి పాఠశాల పిల్లలతోపాటు అటవీ శాఖ నిర్వహించిన నల్లమల సఫారీకి చైతూ వెళ్లాడు. ఫొటోలు తీయటం అంటే ఆసక్తి ఉన్న చైతూ అతడితోపాటు కెమేరా తీసుకెళ్లాడు.
భోజనాల సమయంలో సీతాకోక చిలుకల ఫొటోలు తీస్తూ మిగిలిన వాళ్ల కంటే కొంచెం దూరం వెళ్లాడు చైతూ. ఆ సమయంలో అక్కడికి ఒక పులి ఒకటి వచ్చింది. ఆ హడావిడిలో వ్యాన్లో చైతూ లేడన్న సంగతి గమనించుకోకుండా మిగిలిన వాళ్లందరూ వెళ్లిపోయారు.
పులి కంటబడకుండా, తిరిగి వ్యాన్ దగ్గరకు చేరుకోటానికి అడవిలో పరుగెత్తుతున్న చైతూకి ‘చెట్టెక్కు,’ అన్న మాటలు వినిపించాయి. ఆ మాటలు చెంచు బాలుడు బైనావి. చైతూని తమ గూడేనికి తీసుకుని వెళతానన్నాడు బైనా.
అడవిలో బైనా, చైతూలకు టువంటి అనుభవాలు ఎదురయ్యాయి? చింతలగూడేనికి చేరుకున్న తరువాత ఏం జరిగింది? ఆ అనుభవం వాళ్ల జీవితాలను ఏలా మలుపు తిప్పింది? తెలుసుకోవాలంటే ‘నల్లమలలో…’ చదవాల్సిందే.