Pillipilla Pintu పిల్లిపిల్ల పింటూ

40.00

Description

“పులికి గోళ్లున్నాయి నాకూ గోళ్లున్నాయి, పులికి కోరలున్నాయి నాకూ కోరలున్నాయి… మరి నన్ను చూసి ఎందుకు భయపడరూ?” అన్న అనుమానం పెంపుడు పిల్లి పింటూకి వచ్చింది. అదే ప్రశ్న మచ్చల జింక మల్లికని, కొండ గొర్రె కొమరయ్యని, బద్దకపు ఎలుగుబంటిని, కురస కాళ్ల గుంటనక్కని అడిగింది పిల్లిపిల్ల పింటూ. చివరికి రావి చెట్టు కింద అట్లు పోసుకునే అవ్వ ఇచ్చిన సమాధానం పింటూకి నచ్చింది. ఇంతకీ అవ్వ ఇచ్చిన సమాధానం ఏమిటి? చదవండి…

కథతోపాటు దీనికి బొమ్మలను చైతన్య వేశారు.

పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి ఔత్సాహిక రచయితలు, చిత్రకారుల నుంచి బొమ్మల కథల పుస్తకాలను తానా, మంచి పుస్తకం ఆహ్వానించాయి. అలా వచ్చిన వాటిల్లోంచి ఎంపిక చేసిన పది పుస్తకాలలో ఇది ఒకటి.