Science Padhati సైన్స్ పద్ధతి

20.00

సైన్స్ అంటే సమాచారం కుప్పగా కూడిన ఒక లైబ్రరీయా? అందులోకి తొంగి చూసేందుకు అందరికీ అవకాశం ఉండదా? ఈ ప్రశ్నలు ఎవరు అడగాలి? అడిగిన వారికి జవాబులు ఎవరు అందించాలి? సైన్స్ అన్నది అంతం లేని ఒక అన్వేషణ, ఒక కార్యక్రమం. ఒక ప్రక్రియ. ప్రశ్నల పరంపర. అర్థం అయినవాటి గురించి, కాని వాటి గురించీ, అనుమానాలను పెంచుకుని, ఎందుకు? ఎట్లా? అని ప్రశ్నలు అడగాలి. వాటికి జవాబులు వెతకాలి. అదే సైన్స్…

వందల సంవత్సరాల అనుభవం మీద సైంటిఫిక్ మెథడ్ అనే విజ్ఞాన పద్ధతి సిద్ధమయింది. తత్వశాస్త్రం నుంచి సైన్స్ కు దారిగా ఈ పద్ధతి నిలబడింది. నాటికీ, నేటికీ ఇందులో అంచెలు ఒకే రకంగా ఉన్నాయి…

ఈ క్రమంలో ఎక్కడా రహస్యం లేదు. మొండిపట్టు అసలే లేదు. ఫలితాలను సరిచూసే స్థాయిలో ఎవరయినా గట్టి అనుమానాన్ని, ఆక్షేపణను తీసుకురాగలిగితే కొత్త ఆలోచనల దృష్టితో మళ్ళీ పరీక్షలు మొదలవుతాయి. అందరూ అంగీకరించిన విషయమే వైజ్ఞానిక సత్యంగా నిలబడుతుంది. అది కూడా శాశ్వత సత్యం కాదు. దాని మీద ప్రయోగాలు సాగుతూనే ఉంటాయి. తెలిసిన సత్యం నిజం కాదని ఎవరయినా నిరూపణ చేయగలిగితే అందరూ తలవంచ వలసిందే. అక్కడో కొత్త సత్యం పుడుతుంది. కాబట్టి సైన్స్ లో సత్యాలు ఎప్పుడూ పరీక్షకు లొంగేవే. అవి సాపేక్ష సత్యాలు.

Categories: , Tags: ,