Subbarao Sapeksha Lokam సుబ్బారావు సాపేక్ష లోకం

25.00

మూలం: జార్జి గామోవ్
స్వేచ్ఛానువాదం: డా. వి. శ్రీనివాస చక్రవర్తి

జార్జి గామోవ్ భౌతిక శాస్త్రవేత్త. రష్యాలో పుట్టిన గామోవ్ లెనిన్‍గ్రాడ్‍లోని రేడియో ఇన్‍స్టిట్యూట్‍లోని భౌతికశాఖలో పనిచేసాడు. 1933లో బ్రస్సెల్స్‍లోని అణుభౌతిక శాస్త్రవేత్తల సమావేశానికి హాజరైన గామోవ్ రష్యాకి తిరిగి వెళ్ళలేదు. అమెరికాలో స్థిరపడిన గామోవ్ జార్జి వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో 20 ఏళ్ళపాటు ఆ తరువాత కాలిఫోర్నియా, కొలరాడో విశ్వవిద్యాలయాల్లో పనిచేసాడు. ఆస్ట్రోఫిజిక్స్, కాస్మోలజీ, డి.ఎన్. ఎ, అణుధార్మికత, అణుసంయోగం వంటి పలు అంశాలపై గామోవ్ పరిశోధనలు చేసాడు. గామోవ్ అనేక విజ్ఞానశాస్త్ర పత్రాలు, పుస్తకాలు, సైన్సు ఫిక్షన్ పుస్తకాలు రాసాడు. ప్రస్తుత పుస్తకం గామోవ్ రాసిన మిస్టర్ టాంప్‍కిన్స్ సిరీస్ నుంచి స్వేచ్ఛానువాదం.

టాంప్‍కిన్స్ (అనువాదంలో సుబ్బారావు) బ్యాంకు గుమాస్తా. గణితంలో పరిమితమైన జ్ఞానానికిమించి అతడికి ప్రొఫెసర్లు చెప్పేది అంతగా అర్థం కాదు. ఉపన్యాసం వింటూ కలల ప్రపంచంలో విహరిస్తాడు. టాంప్‍కిన్స్ సిరీస్‍కి గామోవ్‍కి యునెస్కో (ప్రజలలో విజ్ఞానశాస్త్ర వ్యాప్తికి ఇచ్చే) కళింగ బహుమతి లభించింది.

Category: