Tanvi Mitrulu తన్వి మిత్రులు

40.00

Description

జూ వాచ్‌మెన్ కూతురు ఫాతిమా, ఆమెకి జూలో తిరగటం ఇష్టం. వందేళ్లు పైబడిన తాబేలు తన్వి, ఇంకా ఇతర మిత్రులతో కలిసి ఆడుకుంటూ ఉంటుంది. ఒకసారి తన్వికి గాజు సీసా వల్ల వెనక కాళ్లకు గాయమై తిరగలేని స్థితి వచ్చింది. అప్పుడు ఫాతిమా ఒక ఉపాయం ఆలోచించింది. దానివల్ల తన్వి నడవగలగటమే కాదు జూకి వచ్చే వాళ్లకి ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఆ ఉపాయం ఏమిటో ఈ పుస్తకం చదివి మీరే తెలుసుకోండి.

దీనికి బొమ్మలను తుంబలి శివాజీ వేశారు.

పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి ఔత్సాహిక రచయితలు, చిత్రకారుల నుంచి బొమ్మల కథల పుస్తకాలను తానా, మంచి పుస్తకం ఆహ్వానించాయి. అలా వచ్చిన వాటిల్లోంచి ఎంపిక చేసిన పది పుస్తకాలలో ఇది ఒకటి.