Telugu Adhyapana Vidhanam తెలుగు అధ్యాపన విధానం

60.00

తెలుగు బోధన పద్ధతులపై రెండుమూడు పుస్తకాలకన్నా లేవు కాబట్టి ఈ గ్రంథం అధిక ప్రసంగం కానేరదు.

పాఠశాలలో, సంఘంలో మాతృభాష స్థానం పెరుగుతుండటం వల్ల మాతృభాషోపాధ్యాయుల బాధ్యత పెరుగుతోంది. భాషాజ్ఞానం ఒక్కటే ఉపాధ్యాయులకు చాలుననే రోజులు గతించి, పద్ధతుల అవసరం స్థిరపడింది. పద్ధతి బద్ధమైన బోధన బాలలకు, తమకు కూడా లాభకరమని ఉపాధ్యాయులు గ్రహిస్తున్నారు.

తెలుగు బోధన పద్ధతుల వివిధ సమస్యల ఆంతర్యాన్ని గ్రహించి, ఉపాధ్యాయులు వాటిని స్వతంత్రంగా ఎదుర్కోటానికి సహాయపడేట్లు ఈ పుస్తకాన్ని రాశాను. శిక్షణ పరీక్షలకు మాత్రం కావలసిన అంశాలను అరటిపండు ఒలిచిపెట్టినట్లు అందించలేదు కాబట్టి, పరీక్షల దృష్టితో దీనిని చదివేవారికి కొంత ఆశాభంగం తప్పదు. ప్రశ్నలు కూడా చర్చకు దోహదాలుగా ఉంటాయి. అనేక ప్రశ్నలకు ఉపాధ్యాయులు తమ అనుభవాన్నీ, ప్రయత్నాన్నీ పరిశీలించుకోవలసి ఉంటుంది. కాబట్టే వాటిని పరిశీలనాంశాలు అన్నాను.

విషయంలోని అన్ని అంశాలు స్థూలంగా స్పృశింపబడ్డాయి కాబట్టి, వివిధ ప్రణాళికలకు ఉపయోగపడతాయి. అవసరాన్నిబట్టి క్రమం, అంశం మాత్రం సరిచూచుకొంటే చాలు.

ప్రాంతీయ భాషలలో సాంకేతిక గ్రంథాలు అనేకం భాషాంతరీకరణపు యాసలతో ఉండటం చూస్తున్నాం. నా అనుభవాన్నీ, ఆరేడు సంవత్సరాలు ఈ విషయంపై చదివి సంపాదించిన జ్ఞానాన్నీ ఆధారంచేసుకొని, ఈ గ్రంథాన్ని స్వతంత్రంగా రాశాను. అందువల్ల పైనచూపిన లోపం దీనిలో ఉండదని ఆశిస్తున్నాను. ఒకమారు ఆమూలాగ్రంగా చదివి, తిరిగి క్షుణ్ణపరిశీలనకు దిగితే మంచిలాభం ఉంటుందని పాఠకులకు మనవి.

– సత్తిరాజు కృష్ణారావు

Product Description

Telugu-Adhyapana-Vidhanam

ఈ మంచి పుస్తకం గురించి నలుగురికీ చెప్పండి...Share on Facebook
Facebook
0Share on Google+
Google+
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin