Unima Lokamlo… ఉనిమా లోకంలో…

20.00

Product Description

విద్యుత్తు ఇంజినీరు అయిన రఘు, అతడి తొమ్మిదేళ్ల కొడుకు రాజు మెరుపు తాకిడికి ఉనిమా లోకం చేరుకున్నారు. అంతకు ముందు బర్క్‌లీ పరిశోధన శాలలో ఫైన్‌మాన్ అనే శాస్త్రవేత్త ప్లాస్మా టెలిపోర్టేషన్ పై ప్రయోగాలు చేస్తున్నాడు. విద్యార్థులకు దానిని వివరిస్తూ ప్రమాదవశాత్తు ప్లాస్మాగా మారి, ఉనిమాలోకం చేరి తిరిగి తన రూపం పొందాడు ఫైన్‌మాన్.
ఉనిమా లోకంలో బంగారం ఉత్పత్తి చేస్తుంటారు. అక్కడ వివిధ విభాగాలు ఉన్నాయి. గుణ గణ యంత్రం, ‘ప్లానిబా’, ‘కవేదా’ వంటి అనేక యంత్రాలు ఉన్నాయి. ఆ యంత్రాల వద్ద పని చెయ్యటానికి యాంగ్ అనే యంత్రమనుషులు ఉన్నారు. ఉనిమా లోకంలో పనులను ‘నంది’ పర్యవేక్షిస్తూ ఉంటాడు. అయితే అతడి పెత్తనాన్ని, సౌకర్యాల లేమిని సహించలేని లింగ్ యాంగ్ అనే యంత్రమనిషి తిరుగుబాటుకి ప్రయత్నించి ‘కవేదా’ పని చెయ్యకుండా చేశాడు.
విద్యుత్తు ఇంజినీరు అయిన రఘుకి సమస్య ఎక్కడ ఉందో తెలిసింది కానీ దానిని సరిచెయ్యలేకపోయాడు. స్మార్ట్ ఫోన్ లోకంగా బతికే తొమ్మిదేళ్ల రాజు ఫైన్‌మాన్ సహాయంతో సమస్యను పరిష్కరిస్తాడు. సమస్యకు కారణం అయిన లింగ్ యాంగ్‌కి శిక్ష పడింది. దానిని పరిష్కరించిన రాజు, రఘులకు తిరిగి భూలోకవాసం లభించింది.
రాజు పెద్దవాడై శాస్త్రజ్ఞుడు అయ్యాడు. అతడికొడుకు తొమ్మిదేళ్ల రాఘవ అతడితో పాటు ప్రయోగశాలలో ఉన్నాడు. చరిత్ర పునరావృతం అవుతుందా…

ఈ మంచి పుస్తకం గురించి నలుగురికీ చెప్పండి...Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin