Ushnam Ushnograta ఉష్ణం ఉష్ణోగ్రత

30.00

వేడిగా ఉన్న వస్తువుకి అధిక ఉష్ణోగ్రత ఉందంటాం. అందులో అధిక ఉష్ణం దాగి ఉందంటాం. పైపైన చూస్తే ఉష్ణం, ఉష్ణోగ్రత అనే రెండు పదాలూ ఒకే విషయాన్ని సూచిస్తున్నట్లు అనిపిస్తుంది. మరైతే రెండు పదాలు ఎందుకు? ఆ రెండు పదాలు వేరు వేరు బావనలని సూచిస్తే వాటి మధ్య తేడే ఏమిటి?

ఉష్ణం-ఉష్ణోగ్రత… వీటిని ఎలా కొలుస్తారు? ఆ కొలమానాలని ఎవరు కనిపెట్టారు? ఎలా కనిపెట్టారు? ఆ కొలమాన పద్ధతులు ఎలా మెరుగవుతూ వచ్చాయి? ఘన పదార్ధాలు ఎలా వ్యాకోచిస్తాయి? వాయువులు ఎలా వ్యాకోచిస్తాయి? మళ్లీ ఆ వ్యాకోచంలో ఆదర్శ వాయువులకి, వాస్తవ వాయువులకి మధ్య తేడా ఏమిటి? ఉష్ణం, ఉష్ణోగ్రతలకి వస్తువులోని అణువుల చలనాలకి మధ్య సంబంధం ఏమిటి? గుప్తోష్ణం అంటే ఏమిటి? విశిష్టోష్ణం అంటే ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికి ఈ పుస్తకంలో సమాధానాలు ఉన్నాయి.

ఉష్ణం – ఉష్ణోగ్రత… ఈ భావాలు మొట్టమొదటగా విద్యార్థులకి హైస్కూలు స్థాయిలో పరిచయం అవుతాయి. ఈ రెండు భావాల మధ్య తేడాని స్పష్టంగా అర్థం చేసుకోవడంలో ఎంతో మంది విద్యార్థులు ఇబ్బంది పడుతుంటారు. కఠినమైన శాస్త్రీయ పరిభాషని వాడకుండా, అతిగా గణిత సమీకరణాలని వాడకుండా, పొడి పొడి మాటలతో విషయాన్ని దాటేయకుండా, ప్రతి చిన్న విషయాన్నీ స్పష్టంగా వివరిస్తూ, సరళమైన భాషలో ఉష్ణం, ఉష్ణోగ్రత అనే భావాలు అందరికీ అర్థమయ్యేలా చేస్తుందీ పుస్తకం.

Description

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication