Viraboosina Banti Chettu విరబూసిన బంతి చెట్టు

40.00

Description

మాలినికి మొక్కలు అంటే ఇష్టం. ఆమె తోటలో ఒక్క బంతి మొక్క తప్ప మిగిలినవన్నీ పూసాయి. ఇంట్లో వాళ్లు, స్నేహితులు ఇచ్చిన సూచనలన్నీ ఆమె పాటించింది. అయినా అది పూయలేదు. చివరికి తాతయ్యని అడిగింది మాలిని. తాతయ్య ఎం సలహా ఇచ్చారు? ఆ బంతి మొక్క పూసి మాలనిని సంతోషపరిచిందా? ఏం జరిగిందో తెలుసుకోటానికి ఈ పుస్తకం చదవండి.

దీనికి బొమ్మలను టి.వి. రమేష్ కుమార్ వేశారు.

పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి ఔత్సాహిక రచయితలు, చిత్రకారుల నుంచి బొమ్మల కథల పుస్తకాలను తానా, మంచి పుస్తకం ఆహ్వానించాయి. అలా వచ్చిన వాటిల్లోంచి ఎంపిక చేసిన పది పుస్తకాలలో ఇది ఒకటి.