Baalala Pakshana బాలల పక్షాన

40.00

చదువులేమి కొత్త అంటరానితనాన్ని సృష్టించడంతో పాటు, పాత అంటరానితనాన్ని పాతిపెట్టనీయకుండా ఆపుతుంది కూడా. సామాజిక న్యాయం జరగకుండా భారతదేశం వికసిస్తుందనుకోవడం, కలుపు తీయకుండా పంటను పండిద్దామనుకోవడమే. చదువును అందరి సొంతం చేయకుండా మరి సామాజిక న్యాయానికి పునాదులు వేయడం కూడా అంతే భ్రమ. మన దేశంలో ఆ చదువుకు దూరంగా ఉంది దళిత బహుజనులే. సమానతను ఆచరణలో చూపాలనుకున్న వాళ్లు ముందుగా ఆ దళిత బహుజన కుటుంబాల పిల్లలను బడికి పంపించేలా చూడాలి.

బాలల విద్యాహక్కు పరిరక్షణకు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన సమూలంగా జరగాలన్న రాజీలేని సూత్రాన్ని ఆవిష్కరించి సమస్య మూలాల్ని కదిలించగలిగింది ఎం.వి.ఎఫ్. ఆ ఎం.వి. ఫౌండేషన్ ఉద్యమ ప్రస్థానంలో, ప్రదర్శిత పాఠాలు సంధించిన ప్రశ్నలకు సమాధానాలే వీరి అనుభవాలు. ఈ అనుభవాల్ని ముందుండి ఎదుర్కొన్న ఫౌండేషన్ జాతీయ కో-ఆర్డినేటర్ ఆర్. వెంకట్ రెడ్డి, బాలల హక్కుల పరిరక్షణలో తన తక్షణ ప్రతిస్పందనలకు అక్షర రూపమే, వివిధ పత్రికల్లో ప్రచురితమైన వారి వ్యాసాలు. ఆ వ్యాసాల సంకలనమే ఈ పుస్తకం.

రాజ్యాంగం, అంబేద్కర్ ఆశించిన రాజకీయ న్యాయం దళిత బహుజనుల్ని సమాన పౌరులుగా విముక్తులు కావాలని సూచిస్తున్నాయి. ఆ విముక్తికి రాజమార్గం విద్య. ఈ మార్గంలో చివరి పేజీ వరకు వ్యాసకర్తతో ప్రయాణం చేయండి!

Description

Balala-Pakshana