Chirayuvulu చిరాయువులు – ప్రాచీన రోమన్ చరిత్ర

150.00

Description

చరిత్రలో అత్యంత శక్తివంతమైన, సువిస్తారమైన సామ్రాజ్యాలలో రోమన్ సామ్రాజ్యం ఒకటి. పాశ్చాత్య నాగరికతకి ప్రాచీన మూలాలుగా రెండు సంస్కృతులు ఉన్నాయని చెప్పుకుంటారు. తత్వచింతన, విజ్ఞాన రంగాల్లో ఆ మూలాలు గ్రీకు సంస్కృతిలో ఉన్నాయి. అలాగే సామ్రాజ్య స్థాపనలో, నగర నిర్మాణంలో, సమర్థవంతమైన పాలనలో, అతిశయమైన క్రమబద్ధీకరణతో కూడిన సామాజిక వ్యవస్థల నిర్వహణలో పాశ్చాత్య సంస్కృతికి మూలాలు రోమన్ సంస్కృతిలో ఉన్నాయి.

క్రీ.పూ. 8వ  శతాబ్దంలో స్థాపించబడిన రోమన్ సామ్రాజ్యం క్రీ.శ. 100-200 ప్రాంతాల్లో మహర్దశకి చేరుకుంది. తరవాత అది విపరీతంగా విస్తరించడంతో అప్పటికే బలహీనమైన రోమన్ సామ్రాజ్యం క్రీ.శ. 5వ శతాబ్దంలో తూర్పు, పశ్చిమ భాగాలుగా విడిపోయింది. కాని తూర్పు భాగం మరో వెయ్యేళ్లు బతికి క్రీ.శ. 15వ శతాబ్దంలో ఒటోమాన్ టర్కుల చేతిలో ఓడిపోయింది. ఏయే శక్తుల చర్య వల్ల ఒక మహా సామ్రాజ్యం వృద్ధి చెందుతుంది, ఎలాంటి శక్తుల వల్ల అది పతనమవుతుంది అన్నది తెలుసుకోడానికి రోమన్ చరిత్ర చదవాలి. ప్రపంచ చరిత్ర మీద ఆసక్తి గల ఔత్సాహికుల కోసమే ఈ పుస్తకం.