Chivariki Swechcha చివరికి స్వేచ్ఛ

80.00

చివరికి స్వేచ్ఛ – సద్‌బరీ వ్యాలీ బడి అనుభవాలు

పిల్లలు ‘తాముగా ఉండటానికి’ అనుమతిచ్చే ఈ అద్భుతమైన బడి కథను ఈ పుస్తకం తెలియచేస్తుంది. ఈ బడిలో పాఠ్య ప్రణాళిక లేదు, తరగతులు లేవు, గ్రేడ్లు లేవు, ఒత్తి లేదు, యూనిఫారం లేదు, బడి గంట లేదు, ఒక బడిని తలపించే ఇతర సంప్రదాయాలు ఏమీ ఇక్కడ లేవు. ఇక్కడ పిల్లలను బాధ్యాతయుత పౌరులుగా చూస్తారు, తమ చదువు భారాన్ని వాళ్లే మోస్తారు. అడిగితే తప్పించి పిల్లలకు ‘దూరంగా’ ఉపాధ్యాయులు ఉంటారు. ఇక్కడ పిల్లలు తమ అంతర్గత ఆసక్తులను గుర్తించి పట్టు విడవకుండా వాటిని అనుసరిస్తారు. వాటిని వాళ్లే ఎంచుకున్నారు కాబట్టి ఎంత కష్టమైన వాటిని పరిపూర్ణంగా నేర్చుకుంటారు. ఆ విధంగా విద్యార్థులు తమ విద్యకు స్వంత రూపకర్తలు అవుతారు.

ప్రధాన స్రవంతిలోని బడుల డొల్లతనాన్ని వెల్లి చేస్తూ ఇటువంటి వింత బడులను నడిపిన సాహస వ్యక్తులు ఎప్పుడూ ఉంటూనే ఉన్నారు. అంచులలో ఉంటూనే ఇవి వ్యవస్థను వెక్కిరిస్తూ, విమర్శిస్తూ ఉన్నాయి. ఫలితంగా అందులోనూ కొన్ని చెప్పుకోదగ్గ సంస్కరణలు చోటు చేసుకున్నాయి.

ప్రత్యామ్నాయ బోధనా విధానాలకు సంబంధించిన పుస్తకాలలో ఇది మరొక ఆణిముత్యం అవుతుందనటంలో సందేహం లేదు.

– అరవింద్‌ గుప్తా