Ee Peddallunnare… ఈ పెద్దాళ్లున్నారే…

80.00

Description

పిల్లలు స్వచ్ఛతకు అద్దంలా వుంటారు. వారిని తమ ఇచ్ఛకు తగ్గట్టు పెద్దలు మార్చుకుంటారు. శాఖోపశాఖలై విస్తరించాలని పిల్లలు సహజంగా అనుకుంటారు. మొక్కై వంగనిది మానై వంగదని తమకి తెలిసినట్టు పెద్దలు కంచె కడతారు. పిల్లల్ని కుండీలో మొక్కల్ని చేస్తారు. అంటుకట్టి అద్భుతం అనుకుంటారు. బోనా‌సాయ్ మొక్కల్లా యెప్పటికీ తమ అరచేతుల్లో వుండాలని కోరుకుంటారు. పిల్లలు నిర్మలంగా తెల్ల కాగితంలా వుంటారు. ఆ కాగితం మీద పెద్దలు యిష్టమొచ్చిన గీతలు గీసి, రాతలు రాసి వాళ్ల తలరాత బాగోలేదని తేలుస్తుంటారు. పిల్లలు వాళ్ల ప్రపంచాన్ని నిలుపుకోవడానికే కాదు, రద్దు చేసుకోవాడానికీ, పెద్దల ప్రపంచంలో కలవడానికి నిరంతరంగా పెద్ద యుద్ధమే మౌనంగా చేస్తున్నారు. ఆ మౌనాన్ని వీడేలా పిల్లలతో గొంతు కలిపేలా ఈ విషయాలన్నీ పిల్లల వైపునుండి, పిల్లల అనుభవాల నుండి సహానుభవంతో రాసిందే ‘ఈ పెద్దాళ్లున్నారే…’ అలా గొంతిచ్చిందే ఈ ‘కంప్లైంట్ బాక్స్’. పెద్దలుగా మనం చేసే శుద్ధికి పిల్లలు కలుషితం కూడా అవుతారు. రేపటి తరం బాగుండాలంటే ముందుగా ఇవాల్టి తరం మారాలి. మారి తీరాలి. అందుకే ‘ఈ పెద్దాళ్లున్నారే…’ పిల్లలదిగా కనిపించే పెద్దలది.