Guddellagummi Maremma

45.00

Description

మారెమ్మ పదేళ్ల పిల్ల. ఆమె చిన్నప్పుడే తల్లి చనిపోయింది. తండ్రికి పక్షవాతం. బీర్ప్ప తాతనుంచి బతుకు పాఠాలు నేర్చుకుంటూ పేరుగుతోంది. ఒక ప్రమాదంలో బీరప్ప చనిపోయి మారెమ్మను వంటరిని చేశాడు. బీరప్ప తాత చనిపోయిన తరువాత కథలు తెప్పే మదనయ్య తాత ఆమెకు మంచి-చెడు నేర్పే బంధువయ్యాడు.

నిజానికి మారెమ్మ వంటరి కాదు. ఊరిలో అందరూ అమెకు కావాలి. ‘కొమ్మే’ అని పిలుచుకునే కొండ మేకకు ఆట నేర్పింది. మల్లిగాడు అనే కుక్కకి మేకల మందను కాయటానికి అవసరమైన ఒడుపులన్నీ నేర్పింది. జంతువులకు ఇన్ని నేర్పిన ఆమె లోకం తీరు తెలియని ఎడ్డి జంగయ్యకు మెల్లగా మాటలు, పద్ధతులు నేర్పుతుంది.

బాబాయి కూతురిని చంపిన చిరుతపులిని ఎలాగైనా అంతం చెయ్యాలని పంతం పట్టింది మారెమ్మ. ఇరవై నాలుగు గంటలు అదే ఆలోచన. ‘నువ్వు చిన్నదానివి, నీ వల్ల ఏమవుతుంది,’ అని ఎందరు, ఎన్ని రకాలుగా చెప్పినా ఆమె పట్టు విడవలేదు.

“ధైర్యమంటే దాన్దిరా! వెయ్యిలోక్క మనిషి పుట్టుక. అదెంత పోరిరా!” అన్న పెద్ద పటేలు మాటలే ఆమెకు నిలువెత్తు నీరాజనం.
మేకల మందను అడవులు, గుట్టల్లోకి తోలుకుని వెళ్లే మారెమ్మకు తెలియని విషయం లేదు. అడవుల్లో తిరుగుతుండగా ఆమె ఎటువంటి సవాళ్లను ఏద్రకొంది? చిరుతపులి ఎదురైనప్పుడు ఏమి చేసింది?

1950ల ఆరంభం నాటి తెలంగాణ పల్లెల జీవితాన్ని అచ్చమైన తెలంగాణ భాషలో ఆసాంతం చదివించే నవల. శ్రీకాంత్ బొమ్మలు బాగున్నాయి.

తానా-మంచి పుస్తకం, 2017 బాలసాహిత్య పోటీలో బహుమతి పొందిన నవల.