Description
జాతీయ గీతం ‘జనగణమన’ పాడగానే ‘జైహింద్’ అంటాం కదా! ఇంకా అనేక సందర్భాలలోనూ ఇలా నినదిస్తాం. మరి ఇంత గొప్ప నినాదాన్ని మొదటిసారి ఇచ్చిందెవరో తెలుసా! మన హైదరాబాదుకు చెందిన అబీద్ హసన్. అలాగే, మలేరియా పరాన్నజీవిని సర్ రోనాల్డ్ రాస్ కనుక్కున్నది కూడా ఈ నగరంలోనే. ప్రపంచంలో ఎడో అతి పెద్ద వజ్రమైన ‘జాకబ్ డైమండ్’ను నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ కాగితాల మీద బరువుగా పెట్టేవారట. ఇలా హైదరాబాద్కు సంబంధించిన అనేక చారిత్రక విశేషాలను అందించే పుస్తకమిది. చక్కటి బొమ్మలు, పటాలతో ఉండే దీన్ని చదివితే భాగ్యనగరం గురించి బోలెడు సమాచారం తెలుస్తుంది.
– బాలభారతం, జనవరి, 2017