Description
ఈసోపు పురాతన గ్రీసులో క్రీస్తు పూర్వం 620-524 మధ్య జీవించాడు. అతడి గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అతడికి ప్రకృతి, జంతువుల భాష తెలుసని అంటారు. ఒక ధనికుడివద్ద బానిసగా ఉన్నాడని అంటారు. అతడి పాత్రల చర్యలు ప్రజలను నవ్వించేవి, ఎంత ఎక్కువ నవ్వితే వాళ్లు అంత విజ్ఞులుగా ఎదిగేవారు. ఈసోపు కథలను లియో టాల్స్టాయ్ రష్యన్లోకి అనువదించాడు. అక్కడినుంచి ఇంగ్లీషులోకి, తెలుగులోకి అనువాదం అయ్యాయి. ఈసోపు కథలు సాధారణంగా నీతి వాక్యంతో ముగుస్తాయి. టాల్స్టాయ్ ఈ ముగింపుని తీసివేశాడు. ఈ కథలు దేని గురించో, దీని నుంచి ఏమి నిర్ధారించుకోవాలో పిల్లలు తమంతట తాము తెలుసుకోగలరన్న నమ్మకం అతడికి ఉండేది. నాలుగు భాగాలుగా, తెలుగు-ఇంగ్లీషు ద్విభాషా పుస్తకంగా ప్రచురితమైన ఈసోపు కథలలో మూడవ భాగమిది. ఇందులో 28 కథలు ఉన్నాయి.