Shaheen

Shaheen

30.00

Categories: ,

Product Description

షహీన్ పన్నెండేళ్ల పిల్ల. చిన్నప్పుడే తల్లి చనిపోవటంతో తండ్రే లోకంగా పెరిగింది. తండ్రి అజార్ సైనికుడు. ఇటు సైన్యం, అటు తిరుగుబాటుదారుల మధ్య చిక్కుకుని సైన్యానికి రాజీనామా చేశాడు. అయినా అతడిని ప్రశాంతంగా బతకనివ్వరు.

తాను లేకపోయినా షహీన్ ధైర్యంగా బతకాలని అన్ని రకాల మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇచ్చాడు అజార్. తప్పు చేసినవాళ్ల పట్ల కనికరం చూపించాల్సిన అవసరం లేదనీ, ఆత్మరక్షణ కోసం ఏమి చేసినా తప్పుకాదని షహీన్‌కి నేర్పించాడు అజార్.

సైనిక శిబిరం నుంచి మళ్లీ పిలుపు వచ్చినప్పుడు రెండు రోజులలో తాను రాకపోతే డమాస్కస్‌లోని మామ ఇంటికి వెళ్లమని ధైర్యం చెప్పి వెళ్లాడు అజార్. ఆ మరుసటి రాత్రి షహీన్ ఒక్కతే ఉండగా ఇంటిమీద తిరుగుబాటుదారులు దాడి చేశారు. వాళ్లనుంచి తప్పించుకున్న షహీన్ డమాస్కస్ బయలు దేరింది. దారిలో తిరుగుబాటుదారుల నుంచి మరోసారి తప్పించుకుని బాలికల శిబిరానికి చేరింది.

ప్రజల హితం మరిచి అందరూ స్వలాభపేక్షతో వ్యవహరిస్తూ ఉంటే ప్రజల తరఫున నిలబడటానికి, ప్రజలతో కలిసి ప్రతిఘటించటానికి అనేక వ్యూహాలు తయారు చేసింది షహీన్. శిబిరింలోని తోటి బాలికలు, మామీ, కత్రావ్‌లే కాకుండా గ్రామ ప్రజలు, యువకులు షహీన్‌ కలిసి పోరాడారు.

సిరియా నేపథ్యంలోని ఈ సాహస నవల మిమ్మల్ని ఆద్యంతం ఆసక్తిగా చదివిస్తుంది. తానా – మంచి పుస్తకం బాలసాహిత్య పోటీ, 2017లో బహుమతి పొందిన పుస్తకం ఇది.

ఈ మంచి పుస్తకం గురించి నలుగురికీ చెప్పండి...Share on Facebook0Share on Google+0Tweet about this on TwitterShare on LinkedIn0