Posted on

Interview> ABN Andhra Jyothi

Interview with Suresh Kosaraju by Srisanthi Meher garu of ABN Andhra Jyothi, at the time of Hyderabad National Book Fair.

Article publish date: 20th December, 2022.

Image credit: ABN Andhra Jyothi

An excerpt from this interview:

Q: తెలుగు చదవడం రాని పిల్లలు, తెలుగు చదవమని కోరుకోని తల్లి తండ్రులు ఉన్నారు. అసలు తెలుగు భాష మనుగడ ప్రమాదంలో ఉందంటారా?

చిన్న వయస్సులోనే కనీసం రెండు భాషలు బాగా నేర్పవచ్చు. ఇంగ్లీషు ఒక భాషగా, తెలుగు మాధ్యమంలో చదువులు బాగా చెప్పవచ్చు. ఒకప్పటి మధ్య, ఎగువ మధ్య తరగతి ఎదగటానికి కారణం కుటుంబాల నేపధ్యం. ఇంగ్లీషు మీడియం అయినంత మాత్రాన ఇంగ్లీషు బాగా వచ్చెయ్యాలని లేదు. జీవితంలో ఎదగటానికి ఇంగ్లీషు భాష అవసరమే. కానీ, అందు కోసం తెలుగుని విస్మరించాల్సిన, తక్కువ చెయ్యాల్సిన అవసరం లేదు. కొత్త తెలుగు పదాలను సృష్టించుకోవలసింది పోయి ఉన్న తెలుగు పదాలనే వాడటం లేదు. ఒకప్పటి తెలుగు అయితే ఉండదనే అనిపిస్తోంది, చాలా ఇంగ్లీషు పదాలు తెలుగులోకి వచ్చేశాయి. తెలుగులో రాసినప్పుడే చాలా ఇంగ్లీషు పదాలు ఉంటున్నాయి. అనువాదం చేసేటప్పుడు పట్టి పట్టి తెలుగు పదాలు ఇస్తున్నారేమో కాని తెలుగు భాషలో తెలుగుదనం తగ్గిపోతోంది. బహుశా టెంగ్లిష్‌కి మనందరం అలవాటు పడాలేమో.

You can read the full article here.