Posted on

Interview> Saaranga Magazine చెరగని సంతకం ‘మంచిపుస్తకం’

Published date: 15th April, 2024

యం.వి. ఫౌండేషన్ ‘క్వాలిటి ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రాం’ చేపట్టి, దానిలో భాగంగా గ్రంథాలయ బాధ్యతలు ‘మంచి పుస్తకం’ కి ఇచ్చారు. పాఠశాలలకి పుస్తకాల ఎంపిక, కొనుగోలు బాధ్యతలు ‘మంచి పుస్తకం’ చేపట్టింది. గ్రంథాలయాన్ని ఎలా నడపాలి, పుస్తకాలను పిల్లలకు ఎలా పరిచయం చేయాలి వంటి విషయాల గురించి వాలంటీర్లకు భాగ్యలక్ష్మి జిల్లాలకు వెళ్లి శిక్షణ ఇచ్చేది. ఆ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే పిల్లలు ఎలా ఉన్నారు, ఎలాంటి పుస్తకాలు చదవగలుగుతున్నారు వంటివి అవగాహన అయ్యాయని భాగ్యలక్ష్మి చెప్పారు.

Our dear friend Sajaya’s comprehensive article about Manchi’s Pustakam’s journey of 20 years (and 15 years of foundational work by Bala Sahithi).

‘మంచి పుస్తకం’ (2004 లో) ట్రస్ట్‌గా రిజిస్టర్ కాక ముందు ‘పుస్తకాలతో స్నేహం’ పేరున హైదరాబాదు బుక్ ఫెయిర్‌లో రెండు సంవత్సరాలు స్టాల్ పెట్టారు. ఆ సమయంలో అందుబాటులో ఉన్న బాల సాహిత్యాన్ని వివిధ  ప్రచురణ సంస్థలు, వ్యక్తుల నుండి జమచేసి ప్రదర్శనలో ఉంచటం అనేది అప్పటికి ఒక కొత్త ప్రయత్నం.

పుస్తకాల ఎక్సిబిషన్ అంటే పెద్ద వాళ్ళకే అనే ఒకరకమైన మూస ధోరణిని మార్చింది మాత్రం ‘మంచిపుస్తకం’ ప్రయత్నాల వల్లనే అని కచ్చితంగా చెప్పుకోవాలి. ఆ తర్వాతే అనేక పుస్తక ప్రచురణ సంస్థలు పిల్లల  పుస్తకాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం పెరిగింది. ఆ సమయంలో పిల్లలకు కథల పుస్తకాలను పరిచయం చేయాలన్న ఆసక్తి తల్లిదండ్రులకు అంతగా లేదని, అప్పుడు దృష్టి ఎక్కువగా ‘చదువుల’ మీదే ఉండేదని, చందమామ లాంటి పత్రికలు, రష్యన్ అనువాద సాహిత్యం, బాలల అకాడమి ప్రచురణలు వంటివి గత స్మృతులుగా మారి ఒక లాంటి కొరత ఏర్పడింది అని గుర్తు చేసుకున్నారు ఇద్దరూ.

She talks about our joint publications, bilingual books, Soviet books, story cards, Pustakalato Sneham series, collaboration with TANA (which resulted in 49 original Telugu works), and books under sole distribution with us (CBT and Amar Chitra Katha).

‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ ఒక ప్రణాళికా బద్ధంగా జరిగిందా లేక పనిలో భాగంగా మార్చుకుంటూ వెళ్లారా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ, “పుస్తకాల ప్రచురణ చేస్తున్నప్పుడు అవి పెద్ద ఫాంటుతో, బొమ్మలతో చైల్డ్ ఫ్రెండ్లీగా ఉండటానికి ప్రాధాన్యత ఇచ్చామని; తెలుగు, ఇంగ్షీషు బై-లింగ్వల్ పుస్తకాల ప్రచురణతో పాటు, సోవియట్ బాల సాహిత్యాన్ని మొదట్లో ఎక్కువగా తిరిగి ప్రచురించించామని; ఆ కథలు చాలా ఆకట్టుకునేవిగానూ, రంగుల బొమ్మలతో  చాలా ఆకర్షణీయంగా ఉండటం అనేదానికి ప్రాధాన్య మిచ్చినట్లు” చెప్పారు. “అప్పటికే ఉన్న తెలుగు అనువాదాలలో భాషను సరళీకరించి, ఫాంట్ సైజ్ పెంచి ప్రచురించటం, కొత్తగా కొన్ని అనువాదాలను మళ్లీ చేయించటం, ప్రచురణ మొదలుపెట్టిన కొత్తలో సోవియట్ పుస్తకాలను ఎంచుకోవటం వల్ల రాయల్టీ వంటి చెల్లింపులు లేవు కాబట్టి ఆర్థికంగా నిలదొక్కుకోటానికి వీలయ్యిందని” వివరించారు. అంతేకాక ఆ సమయంలో ఎందరో అనువాదకులు, చిత్రకారులు ‘మంచి పుస్తకం’ నుండి ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా సహాయ సహకారాలు అందించటం కూడా ఈ ప్రయాణంలో చాలా విలువైన అంశంగా గుర్తు చేసుకున్నారు.

We share the role of Prof. Srinivas Chakravarty and of Vignana Prachuranalu in publishing science books in Telugu for children.

కథల పుస్తకాలు మాత్రమే కాకుండా పాపులర్ సైన్స్ పుస్తకాల ప్రచురణ ‘మంచి పుస్తకం’ చేపట్టటం చాలా ముఖ్యమైన విషయం. ఇందులో చెప్పుకోవలసింది ఐజాక్ అసిమోవ్ ‘ఎలా తెలుసుకున్నాం?’ సిరీస్. విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన పుస్తకాల అనువాదం, రాయటంలో చెన్నై ఐఐటి ప్రొఫెసర్ శ్రీనివాస చక్రవర్తి కృషి (అప్పట్లో ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండానే) చేశారు.

‘మంచి పుస్తకం’ ప్రయాణంలో విజ్ఞాన ప్రచురణలతో (ఒకప్పుడు జనవిజ్ఞాన వేదిక) భాగస్వామ్యం చాలా కీలకమైనది. సైన్స్‌కి సంబంధించిన పుస్తకాలు ఈ రెండు సంస్థల ఉమ్మడి ప్రచురణలుగా వెలువడుతున్నాయి.

When Sajaya asked us about what makes Manchi Pustakam stand out, we spoke about our views on Telugu moral stories for children:

మిమ్మల్ని ఏ అంశాలు విభిన్నంగా నిలిపాయి అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ “ఇదివరకు అనే కాదు, ఇప్పటికి కూడా నీతి కథలు, జీవిత చరిత్రలు, స్ఫూర్తిదాయక పుస్తకాలకు డిమాండ్ ఉంది. కధ చివరన నీతిని డిరైవ్ చేసి చెప్పే విధానం సరైంది కాదని ‘మంచి పుస్తకం’ గట్టిగా నమ్ముతోంది.

ఒక కథ చదివిన తరవాత దాని నుండి ఏం గ్రహిస్తారు, అసలు ఆ వయస్సులో గ్రహించాల్సింది ఏమైనా ఉందా అన్నది పిల్లలకే వదిలెయ్యాలి. ఒక కథలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్శ్వం కనిపిస్తుంది. ఒక కథకి ఒక నీతిని మనం అంటగడితే పిల్లలు చూడగల అనేక కోణాలను కట్టడి చేసిన వాళ్లం అవుతాం. వాళ్ల ఊహల రెక్కలను విరిచేసినట్లు అవుతుంది. బాగా చదవటం నేర్చుకోవాలి, పుస్తకాలను పిల్లలు ఇష్టపడాలి అన్న ఉద్దేశాలతో ప్రచురించిన పుస్తకాలుగా ‘మంచి పుస్తకం’ కి ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది.

We also had a chat about the current trends in Telugu children’s literature, attitude of writers and illustrators, the importance of government support, our bulk buyers and supporters, and our future goals.

చందమామ, దాని స్ఫూర్తితో ఒకప్పుడు వచ్చిన పత్రికలు బాల సాహిత్యానికి వేసిన మూసపోతలో చాలామంది రచయితలు ఉండిపోయారనేది వాస్తవం. మారిన సామాజిక నేపధ్యంలో ఈ కాలం పిల్లలకు కావలసినదానికి అనుగుణంగా బాల సాహిత్యంలో రావలసినంత మార్పు లేదని ‘మంచి పుస్తకం’ భావిస్తోంది. అంతేకాక, ఇప్పుడు చెప్పుకోదగిన పిల్లల పత్రికలు లేవు. దీనివల్ల పిల్లల కోసం రాసినది ప్రచురించటానికి ఎక్కువ అవకాశాలు లేవు.

పుస్తకాల ఎంపికను ఇంకా విస్తృతం చెయ్యాలని, ప్రణాళిక దశలో ఉండి పూర్తి చెయ్యాల్సిన పుస్తకాలు ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాయనీ చెబుతూ, ఇదే పనిని ఇంకా బాగా, ఇంకా బాధ్యతతో కొనసాగిస్తామని చెబుతున్నారు.

You can read the full article here.