Description
ఆఫ్రికాలోని వివిధ దేశాల, తెగల కథలు, గాథలు ఇవి. కథలు ఎలా వచ్చాయితో మొదలయ్యి, పుట్టుక కథలు (origin stories, పెంపుడు జంతువులు ఎలా వచ్చాయి, పండగలు ఎలా వచ్చాయి వంటివి), తెలివి, బలం, వినోదానికి సంబంధించిన 40 కథలు ఇందులో ఉన్నాయి.
జానపద కథలు ప్రజల నాల్కల మీద, మనస్సులో నిలిచిపోతాయి. వాటిని ఈ రోజు మనం కథలుగా చదువుకుంటున్నాం. వీటిల్లోని కథాంశం మానవాళి అంతటికీ వర్తిస్తుంది. కొన్ని కథలు (ప్రత్యేకించి కొతి, మొసలి వంటివి) మన కథలే అనిపిస్తాయి.
చీకటి ఖండం అని మనం అనుకునే ప్రాంతం నుంచి వచ్చిన ఈ వెలుగు రవ్వలను ఆస్వాదించండి.
2012లో మొదట ముద్రితమైన ఈ పుస్తకం ఇప్పుడు మూడవ ముద్రణగా మీ ముందు ఉంది.