Description
Anni Telisina Akka అన్నీ తెలిసిన అక్క
బుడ్డికి ఒక అక్క ఉంది. ఈ అక్కకి ఒక ప్రత్యేకత – తను అన్నీ తెలిసిన అక్క! అక్కచెల్లెళ్లకి ఒక రోజు ఇంట్లో ఒక ‘వింత’ కనిపించింది. అది ఏంటో తెలుసుకోవాలని బుడ్డి వేసే ప్రశ్నలకు అక్క అన్నీ తెలిసినట్టుగానే జవ్వాబులు ఇస్తోంది! ఇంతకీ ఆ ‘వింత’ ఏంటి? అక్కకి నిజంగానే అన్నీ తెలుసా? మీరు తెలుసుకోవాలంటే ఈ కథ చదవాలి!
పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి ఔత్సాహిక రచయితలు, చిత్రకారుల నుంచి బొమ్మల కథల పుస్తకాలను తానా, మంచి పుస్తకం 2019లో ఆహ్వానించాయి. అలా వచ్చిన వాటిల్లో ఎంపిక చేసిన పుస్తకాలలో ఇది ఒకటి.







