Description
నగరంలో వర్షం పడుతుండగా ఒక చిన్నారి, అతని స్నేహితుడు ఒక గొడుగు కింద తల దాచుకున్నారు. ఆ అబ్బాయి తన కుక్క టిల్లుని గొడుగు కిందకి పిలిచాడు. ముగ్గురికి ఆ గొడుగు చిన్నది కావడంతో, దయాళ్ మామ దగ్గర నుంచి ఆ అబ్బాయి పెద్ద గొడుగు తీసుకున్నాడు. కానీ, ఇంకా చాలా మంది స్నేహితులు వచ్చారు. అందరినీ తడవకుండా, పొడిగా ఉంచటానికి సరిపోయేంత గొడుగు ఎక్కడైనా ఉందా?
మనోజ్ కుమార్ రాసిన కథకి హర్షవర్ధన్ కదం బొమ్మలు వేశారు.