Description
Badiki Ontariga బడికి ఒంటరిగా
‘ బడికి వెళ్లే సమయం అయ్యింది. నేను, నా దోస్తులు ఎప్పుడూ బడికి కలిసి వెళతాం. అయితే, ఈ రోజు వాళ్ళు బస్తీలో లేరు. ‘
సిమ్రన్ ఎప్పుడూ బడికి ఒంటరిగా వెళ్ళలేదు. ఆ రోజు ఆమె ఎలా గడిపింది? తెలుసుకోవాలంటే ‘ బడికి ఒంటరిగా ‘ చదవండి!
ఈ కథ రాసిన సిమ్రన్ ఉయికే ప్రస్తుతం పన్నెండవ తరగతి చదువుతోంది. తమ సముదాయం (ఓఝా గోండ్లు) ఎదుర్కొనే వివక్షతను అధిగమించటానికి తనకి, తన స్నేహితులకు చదువు సహాయపడుతుందని సిమ్రన్ నమ్ముతుంది. చెత్త ఏరుకునే అమ్మాయిగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ తన నమ్మకాన్ని వదులుకోకుండా, పట్టుదలతో చదువు కొనసాగించింది.
చిత్రకారిణి కృత్తిక కామిక్ రూపకర్త, గ్రాఫిక్ డిజైనర్. జెండర్, లైంగికత, యథాతథ స్థితి వంటి వాటిని ఆమె పరిశోధిస్తారు.