Description
Bhale Pata! భలే పాట!
ఇది బుందేల్‌ఖండ్ జానపద కథ. ఈ బొమ్మల కథకి జితేంద్ర ఠాకూర్ వేసిన బొమ్మలు ఎంతో ఆకట్టుకుంటాయి.
ఒకామెకి పాటలు రావు. ఇరుగు పొరుగు వాళ్లు పాటలను పట్టణంలో కొనుక్కున్నామంటే ఆమె భర్తని పట్టణం నుంచి ఒక పాట కొనుక్కుని రమ్మంటుంది. అయితే అతడికి పట్టణంలో కొనటానికి ఎక్కడా పాట దొరకదు. అతడు ఊరికి తిరిగి వస్తుండగా వేరు వేరు జంతువులను చూసి నాలుగు చరణాల పాట కడతాడు. ఆ పాటని భార్యకి నేర్పిస్తాడు. ఆమె ఆ పాట పాడుతూ పని చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది? ఈ బొమ్మల కథ చదవండి.
2012లో మొదట ప్రచురించిన ఈ పుస్తకం ఇప్పుడు తిరిగి ముద్రితమయ్యింది.