Description
పురాతన గ్రీకుల నుండి న్యూటన్ యుగం వరకు చలనం, ధ్వని, ఉష్ణం అనే రంగాలు శాస్త్రీయ చింతనను ఆకట్టుకున్నాయి. ఆధునిక భౌతిక శాస్త్రానికి మూలాలైన ప్రాథమిక భావనకు ఈ శతాబ్దాలు జన్మని ఇచ్చాయి. Understanding Physics (భౌతిక శాస్త్రాన్ని అర్థం చేసుకుందాం) అనే గ్రంథమాల మొదటి సంపుటిలో, ప్రఖ్యాత అమెరికన్ సైన్స్, సైన్స్ ఫిక్షన్ రచయిత ఐజాక్ అసిమోవ్ శాస్త్రీయ వికాసానికి చెందిన ఒక ముఖ్యమైన, అద్భుతమైన దశను దక్షతతో, స్పష్టతతో మనకు వివరించారు. తన పాఠకుల నుండి కనీస వైజ్ఞానిక పరిజ్ఞానాన్ని మాత్రమే కోరుతూ, విద్యార్థి సాధికారిక పాఠ్యపుస్తకానికి పరిపూర్ణ అనుబంధంగా ఉండేలా దీనిని రూపొందించారు.