Description
Bomma Gurram బొమ్మ గుర్రం
రామి ఒక చిన్న బంజారా పిల్ల. రామి వాళ్ళ అమ్మ రంగురంగుల గుడ్డ ముక్కలతో బొమ్మ గుర్రాలు కుట్టి రోడ్డు పక్కాగా అమ్మేది. చిన్న చిన్న అద్దాలూ, రిబ్బన్లతో అలంకరించిన ఆ బొమ్మలతో ఆడుకోవాలని రామికి అనిపించేది! కాని అవి మాసిపోతే అమ్మలేనని అమ్మ ముట్టుకోనిచ్చేది కాదు.
“కావాలంటే నువ్వే ఒక చిన్న బొమ్మ గుర్రం చేసుకో వచ్చుగా” అని అమ్మ అనడమేంటి రామి ఎగిరి గంతేసి పని మొదలు పెట్టింది. తాను కుట్టిన గుర్రమంటే ప్రాణం, అదే ప్రపంచం!
ఒక రోజు బొమ్మ గుర్రం కొనుక్కోవడానికి ఒక పాప వాళ్ళ అమ్మతో వచ్చింది. ఆ పాప రామి చేసిన గుర్రం బొమ్మే కావాలని మొండికేసింది. అప్పుడేమయింది? ‘ బొమ్మ గుర్రం ‘ చదవండి.
చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డ పిల్లల పుస్తక రచయితల పోటీల్లో పైకి చదివే పుస్తకాల శ్రేణిలో రెండవ బహుమతి పొందిన రచన ” బొమ్మ గుర్రం “.