Description
Chaduvulu – Kottadarulu చదువులు – కొత్తదారులు
నేర్చుకోవటం జీవితం నుంచి వేరైన నాటి నుంచి ‘చదువు’ మొదలయ్యింది. ఉన్నవారికీ, లేనివారికీ మధ్య ఈ చదువు వివక్షత చూపుతూ ఉన్నవారిని అందలం ఎక్కిస్తూనే, ఇంకోవైపు చింత బెత్తం, బట్టీ పట్టడం, మూసపోత మూక ఆలోచన విధానాన్ని ప్రోత్సహిస్తూ వస్తోంది. చదువును ఆసక్తికరంగా, సృజనాత్మకంగా, ఆనందదాయకంగా, జీవితంతో సంబంధం గలదిగా మలచటానికి సమాంతరంగా అనేక ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ విషయంలో మన దేశంలో ఠాగూర్, గాంధి, గిజుభాయి ఆలోచనలు ఎందరికో ప్రేరణగా నిలిచాయి. ఇటువంటి తత్వవేత్తలు, విద్యావేత్తల గురించి, చదువులలో ప్రయోగాల గురించి అయిదు పుస్తకాలను కూర్చి ‘చదువులు – కొత్తదారులు’ పేరుతో ఒకే పుస్తకంగా ప్రజా సైన్స్ వేదిక, మంచి పుస్తకం కలిసి ప్రచురించటం సంతోషం. అన్ని వేళలా, అన్ని సందర్భాలలో పిల్లల పక్షాన ఉండటమే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చేయవలసిన పని అని ఈ పుస్తకాలు చెబుతాయి. ఇంకెందరో విద్యావేత్తలూ, వారి ప్రయోగాలూ ఇందులో చోటు చేసుకోకపోయినప్పటికీ ఈ ప్రయత్నం చదువుతో ముడిపడిన వారందరికీ- విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పిల్లల బాగు కోరే వారందరికీ ఉపయోగకరంగా ఉంటుందనీ, ఆలోచనలకు ఊతం అవుతుందనీ ఆశిస్తున్నాం.
ఇందులో భాగమైన అయిదు పుస్తకాలు-
- చదువుల ప్రయోగాలు – అరివింద గుప్తా
- సరదా చదువు – అరివింద గుప్తా
- నీల్‌బాగ్ డేవిడ్ – ఎస్. అనంతలక్ష్మి, రోజాలిండ్ విల్సన్
- అపురూపమైన బడి – డా. అభయ్ బంగ్
- మంచి బడి – జాన్ హోల్ట్





