Description
Chaturmukham చతుర్ముఖం
రంజన్ ఆస్ట్రేలియాలో పనిచేస్తున్న ఒక శాస్త్రవేత్త. పది మందికి మేలు చేయాలన్న ఉద్దేశ్యంతో తన ఆవిష్కరణలను ప్రపంచానికి అందించాలని ఆరాటపడే మనిషి. ఇప్పుడు అతడిపై అతని చుట్టూ ఉన్నవారు తీవ్ర నిఘా విధించారు. ఎవరినైనా సహాయం అడగాలంటే కూడా ఉత్తరాల ద్వారా మాత్రమే అది సాధ్యం. రంజన్ తన చిన్ననాటి స్నేహితులనే అడగాలని నిర్ణయించుకుంటాడు. వేర్వేరు ప్రాంతాల్లో, వృత్తుల్లో ఉన్న వీళ్లు రంజన్‌కి ఎలా సాయపడగలరు? అతన్ని కాపాడటమేకాకుండా, అతని ఆవిష్కరణను కూడా ప్రపంచానికి అందించగలరా అన్న ప్రశ్నలకు సామాధానమే ఈ చతుర్ముఖం!
తానా – మంచి పుస్తకం పది సంవత్సరాల పైన పిల్లలకు నవలలు 2025లో ఎంపికైన అయిదు నవలలో ఇది ఒకటి.




