Description
Chemanthi చేమంతి
ఊరు ఊరు మా ఊరు
ఊరి ముందర మా తోట
తోటలోన జామి చెట్టు…
కవికాకి కోగిర జై సీతారాం గారి కొన్ని గేయాలు ఇలా తెలుగు అకార్డియన్ పుస్తక రూపంలో మీ ముందుకు వచ్చాయి. అకార్డియన్ పుస్తకం అంటే కింద ఫోటోలో చూపించినట్టుగా బారుగా తెరుచుకుంటుంది.
ఈ పుస్తకంలో రెండు చిట్టి గేయాలు ఉన్నాయి – ‘చేమంతి’ , ‘గుప్ గుప్ జెగ్ బుగ్’. రెంటికీ యోషిత పింజల అందమైన బొమ్మలు వేశారు!
ఇందులో మరో ప్రత్యేకత – పుస్తకంలో ఉన్న QR కోడ్ స్కాన్ చేసి పాట రూపంలో కూడా ఆస్వాదించవచ్చు!
గాయిక: వి.ఎస్. పవిత్ర






