Description
Chinnari Gudlaguba చిన్నారి గుడ్లగూబ
కథలంటే పిల్లలు చెవి కోసుకుంటారు. 3-7 సంవత్సరాల పిల్లలు వారి పరిసరాలకు సంబంధించిన కథలను ఇష్టపడతారు. పిల్లల కోసం తయారు చేసిన బొమ్మల కథలలో తక్కువ పాత్రలు ఉండాలి. కొన్ని తెలియని అంశాలను, సవాళ్ళను వాళ్ళ ముందు ఉంచాలి. కథల ద్వారా కొన్ని తెలిసిన విషయాలను తిరిగి చెప్పవచ్చు. అలాగే, తెలియని ప్రపంచానికి తలుపులను తెరవవచ్చు. ఈ కథలకు బొమ్మలు పెద్దగా ఉండాలి, అన్ని వివరాలతో ఉండాలి – అప్పుడే అవి పిల్లల దృష్టిని ఆకర్షిస్తాయి. ఇటువంటి కథలను చిన్నపిల్లలకు చదివి వినిపించవచ్చు, అప్పుడే చదవడం నేర్చుకున్న పిల్లలకు ఇవ్వవచ్చు.
మైక్ థేలర్ రాసిన ఈ కథకి విప్లవ్ శశి బొమ్మలు వేసారు. తేజీ గ్రోవర్ హిందీలోకి, కె. సురేష్ తెలుగులోకి అనువదించారు.
2009లో మొదటి ముద్రణ రాగా, 2020లో అయిదవ ముద్రణ వెలువడింది.