Description
చిన్నారి నేస్తం (The Little Prince) మొదట ఫ్రెంచ్, ఇంగ్లీషు భాషల లో 1943లో ప్రచురితం అయ్యింది. విమాన చోదకుడైన కథకుడు అత్యవసర పరిస్థితిలో సహారా ఎడారిలో దిగవలసి వస్తుంది. ఆ ఎడారిలో వేరే గ్రహం నుండి వచ్చిన చిన్నారి నేస్తం కలుస్తాడు. అతని గ్రహం గురించి, అతను చూసి వచ్చిన గ్రహాలు, అక్కడ కలిసిన వ్యక్తుల గురించి చిన్నారి నేస్తం చెబుతాడు. ఒంటరితనం, స్నేహం, ప్రేమలను గురించి చర్చిస్తాడు. చిన్న పిల్లల కోసం అని రాసిన ఈ పుస్తకంలో జీవితం గురించి, పెద్దవాళ్ల నైజం, మానవ స్వభావం గురించిన ఎన్నో పరిశీలనలు ఉన్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా 500కి పైగా భాషలలోకి అనువాదమై, 14 కోట్ల ప్రతులు అమ్ముడుపోయాయి. ఆడియో పుస్తకంగా, రేడియో, రంగస్థల నాటకంగా, బ్యాలే, ఒపేరాగా, టీ.వీ. షోగా, సినిమాగా వెలువడి ఈ పుస్తకం ఎంతో ఆదరణ పొందింది.