Description
చంద్రశేఖర్ సుబ్రహ్మణ్యన్ (1910-1995) భారత దేశంలో పుట్టి, అమెరికాలో స్థిరపడిన భౌతిక శాస్త్రవేత్త. చెన్నై ప్రెసిడెన్సీ కళాశాలలోనూ, లండన్‌లోని కేంబ్రడ్జి విశ్వవిద్యాలయం లోనూ చదువుకున్నాడు. ఆ తరవాత అమెరికాలో స్థిరపడి చికాగో విశ్వవిద్యాలయంలో చాలా కాలం పాటు (1937-1984) పని చేసి ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. అక్కడే కాకుండా యెర్కెస్ నక్షత్రశాలలో అధ్యయనాలు చేశారు. ది ఆస్ట్రోఫిజికల్ జర్నల్‌కి 1952 నుంచి 1871 వరకు సంపాదకునిగా పని చేశారు.
భౌతిక, ఖగోళ శాస్త్రాలలో అనేక అంశాలపై చంద్రశేఖర్ పని చేశారు. మొదటి నుంచి అనేక రకాల వివక్షతని ఎదుర్కున్న చంద్రశేఖర్ చాలా ఆలస్యంగా, అంటే 1983లో నోబెల్ బహుమతిని అందుకున్నారు. భౌతిక శాస్త్రంలో ఈ పురస్కారాన్ని విలియం ఫౌలర్‌తో పంచుకున్నారు.
చంద్రశేఖర్ సుబ్పహ్మణ్యన్ కృషినీ, జీవితంలో ఆయన ఎదుర్కున్న ఆటుపోట్లనీ పరిచయం చేస్తూ వేమూరు వెంకటేశ్వరరావు రాసిన జీవిత కథ ఇది.