Description
CLI పిల్లల భాషా ప్రపంచం (18 booklet set)
పిల్లల్లో చదవటం పట్ల ఆసక్తి కలిగించటానికి ఈ 18 పుస్తకాలను రూపొందించాం. పిల్లల పరిసరాలు, భాషా సంపదతో కూడుకున్న ఈ పుస్తకాలను చదవటం పిల్లలు ఇష్టపడతారు. పాఠ్య పుస్తతకాలే కాకుండా చిన్నప్పటి నుంచి ఇతర పుస్తకాలను అలవాటు చెయ్యటం వీటి ఉద్దేశం. ఈ 18 పుస్తకాలు మూడు స్థాయిలలో ఉన్నాయి.
పుసుపు పచ్చ సీరీస్ – ఇవి అన్నిటికంటే చిన్న పుస్తకాలు, తేలికైనవి. వీటిల్లో పెద్ద-చిన్న, పైన-కింద, తెరవడం-మూయటం వంటి భావనలు పరిచయమవుతాయి. ఇందులో 6 పుస్తకాలు ఉన్నాయి, ఒక్కొక్క పుస్తకంలో 8 పేజీలు ఉంటాయి (48 పేజీలు).
నీలం సీరీస్ – ఇవి మధ్యంతర స్థాయి పుస్తకాలు. పొడవు, వేగం, శుభ్రత వంటి భావనలు వీటిల్లో ఉంటాయి. ఇందులో 7 పుస్తకాలు ఉన్నాయి, ఒక్కొక్క పుస్తకంలో 12 పేజీలు ఉంటాయి (84 పేజీలు).
గులాబి (పింక్) సీరీస్ – ఇవి కొంచెం పెద్ద పుస్తకాలు, పిల్లలు ఎక్కువ సేపు దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంటుంది. వీటిల్లో భావనలు పరిచయం చెయ్యటమే కాకుండా చిన్న కథ కూడా ఉంటుంది. ఇందులో 5 పుస్తకాలు ఉన్నాయి, ఒక్కొక్క పుస్తకంలో 16 పేజీలు ఉంటాయి (80 పేజీలు).
మొత్తం 18 పుస్తకాలలో 216 పేజీలు ఉంటాయి.
CLI పిల్లల భాషా ప్రపంచం (18 booklet set)