Click-Win క్లిక్-విన్

45.00

Description

నల్లమల అడవులకు ఆనుకుని ఉన్న చింతపల్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతోంది మహిత. తల్లి నీలకు మొక్కలు పెంచటం ఇష్టం, మూలికా వైద్యం కూడా వచ్చు. తండ్రి మోహన్ రంగనగరం పట్టణంలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు.

మోహన్ స్నేహితుడు రంజిత్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరుగా పని చేస్తున్నాడు. మహిత ఇంటి పక్కన ఆమెకన్నా రెండేళ్లు చిన్నదైన విష్ణుప్రియ ఉంటోంది. మానసిక ఎదుగుదల తక్కువయిన విష్ణు చూసినది చూసినట్టుగా బొమ్మ వెయ్యగలుగుతుంది.

అడవిలోని జీవజాలం ఫొటోలు తీసి పంపిస్తే వాటి గురించి మరిన్ని వివరాలు తెలసుకోవటమే కాకుండా ఎన్నో బహుమతులు పొందవచ్చంటూ పర్యారవణ ప్రేమికులమని చెప్పుకునే బృందం ‘క్లిక్-విన్’ అన్న యాప్‌ని మహిత వాళ్ల బడిలో పరిచయం చేసింది. పిల్లలందరూ అందులో చాలా ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు.

ఇంతకు ముందుకంటే భిన్నమైన రీతిలో వన్యజీవుల స్మగ్లింగ్ జరుగుతోందని మోహన్‌కి రంజిత్ తెలియచేస్తాడు. దీనికీ, క్లిక్-విన్ యాప్‌కీ ఏమైనా సంబంధం ఉందా? ఒక వేళ ఆ అనుమానం నిజమే అయితే దానిని నిరూపించడం ఎలా, దాని వెనక ఉన్న వాళ్లని పట్టుకోవటం ఎలా?

మహితకి తట్టిన ఉపాయం, విష్ణు గీసిన బొమ్మ రంజిత్‌కి ఎలా ఉపయోగపడ్డాయి? ఇక ఆలస్యం చెయ్యకుండా నవలలోకి వెళితే మీ అనుమానాలన్నీ తీరిపోతాయి.

ఈ పుస్తకానికి చిన్నారి ముమ్మిడి బొమ్మలు వేశారు.

పిల్లలలో తెలుగు చదివే సామర్ధ్యాన్ని పెంచటానికి,  పుస్తకాల పట్ల ప్రేమ కలిగించటానికి రచయితల నుంచి 10 ఏళ్ల పైబడిన పిల్లల కోసం నవలలను తానా – మంచి పుస్తకం ఆహ్వానించాయి. వాటిల్లో 2021లో బహుమతికి ఎంపికైన నవలలో ఇది ఒకటి.